‘చార్మినార్‌, చాదర్‌ఘాట్‌ అంతా నాదే’.. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని లిరికల్‌ టైటిల్‌ పాటను రామ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘ఇగో చెప్తున్నా.. ఈ పాట మాత్రం ఫుల్‌ సౌండ్‌లో వినాలా..’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘చార్మినార్‌, చాదర్‌ఘాట్‌ అంతా నాదే..’ అంటూ హిందీ, తెలుగు మిక్స్‌ చేసున్న లిరిక్స్‌తో సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. జులై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.