చంద్రబాబు, జగన్‌, కేసీఆర్ ఏకమౌతారా?

 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరం అన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ అంటూ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ నారాయణ అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మే 23వ తేదీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి మిగిలేది మూడు నామాలేనని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మోడీపై మండిపడ్డారు. నెలకు మేకప్‌ కోసం మోడీ రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్నారని, అసలు మోడీ చాయ్ వాలానా? అంటూ ప్రశ్నించారు నారాయణ. సీబీఐ, ఆర్బీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోడీ ఇక సినిమాల్లో నటించాల్సిందేనని అన్నారు. ప్రస్తుత ఎన్నికల విధానం లోపభూయిష్టంగా సాగుతోందని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ సర్కారు హత్యలేనని విమర్శించిన నారాయణ.. విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంగా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates