YS Jagan in Assembly:
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా పవర్ లో ఉన్న జగన్ ఇంకా ఓటమిని జీర్నించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పోయిన ముఖ్యమంత్రి పదవి గురించే జగన్ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జగన్ మీద మండిపడ్డారు. ఓడిపోయిన తర్వాత నుంచి జగన్ అసలు అసెంబ్లీకి రావడమే మానేశారు. ఏదో ఒక కారణం చెబుతూ జగన్ అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మీద కౌంటర్లు వేశారు.
“ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఒక ఎమ్మెల్యేగా జగన్ ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసెంబ్లీకి వచ్చి జగన్ ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి చర్చించాలి. దానికి నేను అవకాశం ఇస్తాను. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్ కి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తాను. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. ఎమ్మెల్యేగా అయినా జగన్ సరిగ్గా పని చేయాలి అని సలహా ఇస్తున్నాను” అని అన్నారు అయ్యన్నపాత్రుడు.
ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా.. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ పవర్ ని.. ఎంజాయ్ చేశారు జగన్. ఇప్పుడు పదవిపోయి ఎమ్మెల్యేగా అయిపోయేసరికి.. కనీసం ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు కూడా చేయకుండా తన సెక్యూరిటీ, ప్రతిపక్ష హోదా అంటూ కబుర్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైన జగన్ కి ఈసారి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం పులివెందుల ఎమ్మెల్యే గా కూడా సరిగ్గా పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశాలు ఉండవు అని ప్రజలు అంటున్నారు.