HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' కొత్త పోస్టర్‌పై ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌.. వైరల్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త పోస్టర్‌పై ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌.. వైరల్‌

Cyberabad traffic police ed

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ తాజాగా కొత్త పోస్టర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒకే బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పోస్టర్‌ అభిమానుల్లో ఆస‌క్తిరేపుతోంది. తాజాగా ఈ పోస్టర్‌ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమదైన స్టైల్‌లో వాడుకున్నారు. బైక్‌పై వెళ్తున్న ఎన్టీఆర్‌, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ ట్వీట్‌ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇక ఈ ట్వీట్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ స్పందించింది. ‘ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదు. నెంబర్‌ ప్లేట్‌ మిస్సయింది’ అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu