HomeTelugu Trendingప్రముఖ హీరో, ఆయన భార్యకు కరోనా

ప్రముఖ హీరో, ఆయన భార్యకు కరోనా

Hero dhruva sarja tests cor

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో పలువురు స్టార్స్‌ ఈ మహమ్మారి బరిన పడ్డారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీని కూడా ఈ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ కన్నడ హీరో ధృవ్ సర్జా, ఆయన భార్య ప్రేరణ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ధృవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని , ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నామని, త్వరలోనే కోలుకుంటామని అన్నారు. అలానే కరోనా లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని దానిద్వారా మన చుట్టూ ఉన్నవాళ్లకు కరోనా సోకకుండా ఉంటుందని ధృవ్ సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu