HomeTelugu Big Storiesపుష్ప: 'దాక్కో దాక్కో మేక' సాంగ్‌ ప్రోమో.. వైరల్‌

పుష్ప: ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌ ప్రోమో.. వైరల్‌

DaakkoDaakkoMeka Song Promo
ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ‘పుష్ప: ది రైజ్’ పేరుతో 2021 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం.. ఆగస్ట్ 13న ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను ఐదు ప్రధాన భాషల్లో ఐదుగురు పాపులర్ సింగర్స్ పాడారు.

ఇప్పటికే ఈ పాట తమిళం హిందీ కన్నడ మలయాళ వెర్షన్స్ కు సంబంధించిన ప్రోమోలను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు వెర్సన్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. కేవలం 11 సెకన్లు ఉన్న ఈ వీడియో బన్నీ ఫ్యాన్స్ కి పూనకం తెప్పించేలా ఉంది. సింగర్ శివమ్ ఆలపించిన ఈ పాటకు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu