ఆ డిప్రెషన్ నుండి చిరు వల్లే బయటపడ్డా!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇవ్వబోతున్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు దర్శకత్వం వహించారు వి.వి.వినాయక్. గతంలో చిరంజీవి, వినాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ
సంధర్భంగా వినాయక్, చిరుతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.

సినిమా సూపర్ హిట్..
సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలుగుతోంది. సినిమా చూసి చిరంజీవి గారు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. అప్పుడే సినిమా హిట్ ఫీలింగ్ కు వచ్చేశాను.
పెద్ద కాంప్లిమెంట్ అది..
స్టేజ్ మీద అన్నయ్య నన్ను తమ్ముడితో సమానం అని చెప్పడం, తన సినిమాను డైరెక్ట్ చేయడానికి నేను తప్ప మరో డైరెక్టర్ తన ఆలోచనలోకి రాలేదని చెప్పడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది..
ఆ డిప్రెషన్ నుండి అన్న వల్లే బయటపడ్డా..
అఖిల్ సినిమా ఫ్లాప్ నన్ను డిప్రెషన్ లోకి నెట్టేసింది. ఆ డిప్రెషన్ నుండి బయటకి రావడానికి కూడా నాకు సహాయం చేసింది చిరంజీవి గారే.
ఎలాంటి మార్పు రాలేదు..
నటుడిగా అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.. ఈ సినిమా తరువాత ఆయన చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తారు.
చిరు, చరణ్ ల మధ్య తేడా అదే..
చరణ్ సెట్ లో తన పని మాత్రమే చూసుకుంటాడు. కానీ చిరంజీవి గారు చుట్టూ వాతావరణాన్ని గమనిస్తూనే ఉంటారు.
ఇకపై ప్రతి కథ చిరంజీవి గారి చెప్తా..
పరుగులు పెట్టి సినిమాలు చేయడం నాకు నచ్చదు. మంచి కథ దొరికితే సినిమా చేస్తాను. ఇక నుండి ప్రతి కథ చిరంజీవి గారికి చెప్పి ఓకే అన్న తరువాతే సినిమా చేస్తాను.