HomeTelugu Trending'మోసగాళ్లు' నుంచి డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో సాంగ్‌

‘మోసగాళ్లు’ నుంచి డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో సాంగ్‌

Dabbe Manadi Kummesko Song
హీరో మంచు విష్ణు, టాలీవుడ్‌ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా చిత్రం నుండి డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో అనే లిరికల్ వీడియో విడుదల చేశారు. సామ్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట హేమ చంద్ర ఆల‌పించారు. ఇది ఆక‌ట్టుకుంటుంది. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu