HomeTelugu Big Storiesఎన్టీఆర్ 'అరవింద సమేత' కొత్త రికార్డు

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కొత్త రికార్డు

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం టీజర్‌ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచే ఆల్ ఇండియా స్థాయిలో ట్రెండింగ్ అవడం మొదలుపెట్టిన ఈ టీజర్ పూర్తిగా మూడు రోజులు కూడ గడవక ముందే 9 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

12 10

ఎన్టీఆర్ కెరీర్లో ఇదొక కొత్త రికార్డ్ అనుకోవచ్చు. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. నాగబాబు ఎన్టీఆర్ కు తండ్రిగా కనిపించనున్నారు. టీజర్‌ విడుదలయ్యాక అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu