HomeTelugu Big Storiesరజనీకాంత్ 'దర్బార్‌' ట్రైలర్‌ వచ్చేసింది..

రజనీకాంత్ ‘దర్బార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..

12 9
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈ ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. రజనీ తన స్టైల్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌ నిర్మిస్తున్నారు. సునీల్‌ శెట్టి, నివేదా థామస్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu