ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీనే!

ఒక సినిమా మొదలుపెడుతున్నారంటే దానికోసం ముందుగానే వార్తలు, వివాదాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. కొంతమంది కావాలనే వివాదాలు సృష్టించి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం అర్ధం లేని వివాదాలతో కోర్టుకెక్కుతున్నారు. సరిగ్గా ఇలానే నాగార్జున సినిమా విషయంలో జరుగుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా టైటిల్ ను మార్చమని బంజారా సంఘాలకు చెందిన కొందరు డిమాండ్ చేస్తున్నారు.

అవసరమైతే న్యాయం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. టైటిల్ ను ‘హథీరాం బాబా’ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది దర్శకుడు, హీరో, నిర్మాత కానీ ఇలా సినిమాకు సంబంధం లేని వాళ్ళు, అనవసర రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చిత్రనిర్మాతలు అంటున్నారు. నిజానికి ఈ వివాదంలో అర్ధం లేదు.. ఒకవేళ కేసు వేసినా.. నిలబడదు. ఇది కూడా సినిమాకు ఒక రకంగా పబ్లిసిటీ అనే అనుకోవాలి.