HomeTelugu Big Stories'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది

‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

SVP title song is filled with stunning energyసూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో.. ‘మహానటి’ కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిన్న(శుక్రవారం, ఏప్రిల్‌ 22న) గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను స్టార్ట్‌ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసి మహేశ్‌ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది.

‘సరా సరా సర్కారు వారి పాట… షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా…’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఈ రోజు(ఏప్రిల్‌ 23) ఉదయం 11 గంటలకు విడుదలై అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu