HomeTelugu Trending'దసరా' సెకండ్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

‘దసరా’ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

Dasara second single prom
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ తరువాత విడుదలైన పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్ ఆడియన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ వచ్చేసింది. మరోసారి అంతకు మించిన ట్రీట్‌ ఇచ్చేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘ఓరి వారి నీదు గాదుర పోరి ..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌ లవ్‌ ఫెల్యూర్‌ సాంగ్‌లా అనిపిస్తుంది. హీరో తన ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ కనిపిస్తాడు. ఈ పూర్తి పాటను ఈ నెల 13వ తేదీన విడుద‌ల చేయనున్నారు. నాని సినిమా అంటే మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నానికి సరైన హిట్‌ పడలేదు. వరుసగా రెండు, మూడు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ‘దసరా’ తో మళ్లీ నాని ట్రాక్‌లోకి వస్తాడు అనిపిస్తుంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుద‌ల కానుంది.

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu