బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు వ్యాఖ్యాతలు ఎందరు?

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగులో ఇప్పటికే 2 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఆ షోను సూపర్ డూపర్ హిట్‌ చేశాడు. తన స్టార్ స్టేటస్‌ను పక్కన బెట్టి అందరితో కలిసిపోతూ తారక్ బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నడిపించిన తీరు… విమర్శకులను సైతం మెప్పించింది.

తెలుగు బిగ్‌బాస్-2కి హోస్ట్‌గా చేసిన నేచురల్ స్టార్ నాని అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మొదట నాని హోస్టింగ్‌పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయితే వాటిని ఎదుర్కొంటూనే తనను తాను మార్చుకుని షో కంప్లీట్ చేశాడు నాని. అయితే బిగ్‌బాస్ కారణంగా వచ్చిన ట్రోలింగ్ తట్టుకోలేక మళ్లీ హోస్ట్‌గా చేసేందుకు నానికి ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు. మూడో సీజన్‌కి హోస్ట్‌గా ఎవరు చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. బిగ్‌బాస్‌-3 సీజన్‌కు హోస్ట్‌ ఎవరనేదానిపై ఇప్పటికే చాలా రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, దగ్గుపాటి రానా… ఇలా బిగ్‌బాస్-3 సీజన్ వ్యాఖ్యతగా వ్యవహారిస్తారనే వారి లిస్ట్ పెరుగుతూనే ఉంది.

యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్‌కు అటు మాస్‌లో, ఇటు క్లాస్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ మొదటి సీజన్‌ హోస్ట్‌గా వ్యవహారించిన తారక్… అందరిలో కలిసిపోయి అల్లరి చేశాడు. తన మాటకారితనంతో జోకులు వేస్తూనే హుందాగా వ్యవహరిస్తూ షోను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ సీజన్‌కు రికార్డ్ స్థాయి టీఆర్పీ వచ్చిందంటే అందుకు ఎన్టీఆర్ హోస్టింగ్ కారణం. హిందీ, తమిళంలో రొమాన్స్‌, గొడవలతో వివాదాస్పదమైన ‘బిగ్‌బాస్’ తెలుగులో క్లీన్ యూ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఎన్టీఆర్. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్ల బిగ్‌బాస్ సీజన్‌-2 చేయలేకపోయాడని.. మూడో సీజన్‌కి మళ్లీ ఎన్.టీ.ఆర్ వస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిగ్‌బాస్‌-2 సీజన్‌కు బన్నీ హోస్ట్‌గా వస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. సీజన్‌-3కి రావచ్చనే ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది నెం.1 యారీ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహారించి షో సూపర్ హిట్ చేశారు దగ్గుబాటి రానా. బిగ్‌బాస్ మూడో సీజన్‌కి రానా అయితేనే సరిగ్గా న్యాయం చేయగలరనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌లా తన మాటలతో మాయ చేయడం రానాకి బాగా తెలిసిన విద్య. అదీగాక ఇప్పటికే ఫిలింఫేర్ వంటి ఫంక్షన్లకు వ్యాఖ్యతగా చేసి, తన టాలెంట్ నిరూపించుకున్నాడు రానా. అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ. తనదైన మ్యానరిజం, యాటిట్యూడ్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. విజయ్‌ దేవరకొండతో హోస్టింగ్ చేయిస్తే టీఆర్పీ రేటింగ్ రికార్డులు సృష్టిస్తుందనే ఆలోచనతో ఉందట స్టార్ మా యాజమాన్యం. బిగ్‌బాస్ షో చేసేందుకు విజయ్ దేవరకొండ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విక్టరీ హీరో వెంకటేష్‌ హోస్ట్ గా చేసే అవకాశముందని.. వెంకటేశ్ స్టైల్, యాటిట్యూడ్ బుల్లితెర ప్రేక్షకులకు కచ్ఛితంగా నచ్చుతుందని అంటున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను రెండు సీజన్‌లు విజయవంతంగా నడిపించిన అక్కినేని నాగార్జున సైతం బిగ్‌బాస్‌-3ని సమర్ధవంతంగా నడిపించగలడని.. బుల్లితెరపై తన సత్తా చాటిన నాగార్జున ఈ షోకి కరెక్ట్‌ అని మరికొందరు అంటున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున… ఆ షోను రెండు సీజన్ల పాటు నడిపించి, అదుర్స్ అనిపించాడు. ఈ టాలీవుడ్ మన్మథుడికి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇప్పటికే షో నడిపించిన అనుభవం ఉంది కాబట్టి ‘బిగ్‌బాస్’కి నాగ్‌యే కరెక్ట్ అని వాదిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.