‘దసరా’ టీజర్‌ అప్డేట్‌

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ‘దసరా’ టీజర్‌ అప్‌డేట్‌ మాస్‌ స్టైల్‌లో అందించి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు నాని.

ఓ పెద్దాయన బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్‌ తో డిజైన్‌ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. జనవరి 30న టీజర్‌ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ఫెస్టివల్‌ వైబ్స్‌తో ఈ వీడియో ముంగిపు ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన నాని పోస్టర్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో మాస్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates