ఆర్‌.నారాయణమూర్తికి దాసరి జీవితసాఫల్య అవార్డు


దర్శక రత్న దివంగత దాసరి నారాయణరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అందుకున్నారు. బుధవారం సాయంత్రం దాసరి మెమోరియల్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్‌, భీమవరం టాకీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు ఆయన అవార్డులను ప్రదానం చేశారు. దాసరి ఎక్సలెన్సీ అవార్డుకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఎంపిక కాగా ఆ పురస్కారాన్ని ఆయన కుమారుడు పూరీ ఆకాశ్‌ అందుకున్నారు. దాసరి నారాయణరావు, పద్మ మెమోరియల్‌ అవార్డును రాజశేఖర్‌, జీవితలకు అందజేశారు. దాసరి టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ అవార్డును గౌతమ్‌, వేణు, శశికిరణ్‌, వెంకటేశ్‌ మహా, బాబ్జీ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, మురళీమోహన్‌, అంబికా కృష్ణ, వీవీ వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates