HomeTelugu Trendingశెట్టి ఫన్నీ వీడియోతో డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌..

శెట్టి ఫన్నీ వీడియోతో డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌..

3 12
లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నాడు. సోషల్ మీడియాలో రోజుకో వీడియోను విడుదల చేస్తూ అభిమానులను ఆనందించజేస్తు ఉంటాడు. మరీ ముఖ్యంగా మన దేశ సినిమాల్లోని పాటలు, డైలాగులపై ఆసక్తిని చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఫన్నీ వీడియోతో తాను చేసిన టిక్ టాక్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు వార్నర్‌. శిల్పా శెట్టి ఒపెరా పాడుతూ…ఫిల్టర్ సాయంతో ఫన్నీ ముఖ కదలికలతో ఈ వీడియో ఉంది. ఇందులో శిల్పా శెట్టిని చూసి నవ్వు ఆపుకోలేక పడీపడీ నవ్వాడు ఈ క్రికెటర్‌. ఈ వీడియోను చూసి తాను నవ్వు ఆపుకోలేకపోయినట్లు కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu