HomeTelugu Trendingవిజయ్ దేవరకొండపై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు..

విజయ్ దేవరకొండపై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు..

6 22
హీరోయిన్‌, నిర్మాత ఛార్మి హీరో విజయ్ దేవరకొండ సెట్లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవని అంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఫైటర్’ వర్కింగ్ టైటిల్ తో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఛార్మి నిర్మాతగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది.

తాజాగా ఛార్మి మాట్లాడుతూ.. ఈ సినిమాకు మంచి టైటిల్ ను ఫిక్స్ చేస్తామని తెలిపింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని చెప్పింది. అనన్యలో మంచి టాలెంట్ ఉందని తెలిపారు. విజయ్ సెట్స్ లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu