ప్రభాస్‌ని లైన్‌లో పెట్టి షారుక్‌కి డేట్స్‌ ఇచ్చిన దీపిక!

టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ‘ప్ర‌భాస్’ 21వ చిత్రంలో బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు దీపికాప‌దుకొనే గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రూ.25 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇదిలా ఉంటే దీపికా పదుకొనే మొదట తన డేట్స్ ను షారుక్‌ఖాన్ తో నటించనున్న పఠాన్ సినిమాకు కేటాయించింది. అదే టైమ్ లో ప్రభాస్ సినిమాకు సంతకం కూడా చేసింది. కానీ దీపికా వెంటనే షారుక్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతుందట.

న‌వంబ‌ర్ లో షారుక్ ఖాన్ సినిమా షూటింగ్ ను ప్రారంభించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌భాస్-21 వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ నేప‌థ్యంలో మొద‌ట షారుక్ సినిమా చేసి..ఆ త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాకు ప‌నిచేయ‌నుంద‌ట ఈ బాలీవుడ్‌ బ్యూటీ.

CLICK HERE!! For the aha Latest Updates