HomeTelugu Big Storiesఆసుపత్రిలో చేరిన దీపికా!

ఆసుపత్రిలో చేరిన దీపికా!

Deepika padukone clarifies

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది దీపికా పదుకొణె. ఇదిలా ఉంటే తాజాగా దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్‌బీట్‌ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌పై దీపికా ప‌దుకొనే క్లారిటీ ఇచ్చిన‌ట్టు ఓ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీపికా ప‌దుకొనే 3 రోజుల క్రితం రెగ్యుల‌ర్ చెక‌ప్‌లో భాగంగా ఆస్ప్ర‌తికి వెళ్లింద‌ట‌. అంతేకాదు ఆమె ఆరోగ్యంగా ఉంద‌ని, ప్ర‌స్తుతం ప్రాజెక్టు కే షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని తాజా సమాచారం. కాగా దీపికా పదుకొణె పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన ప్రాజెక్ట్‌ కె సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతేకాకుండా షారుక్ ఖాన్‌తో ‘పఠాన్‌’ మూవీ చేస్తున్న దీపికా హాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu