HomeTelugu Trendingఇండియాలో నెంబర్‌-1 హీరోయిన్‌

ఇండియాలో నెంబర్‌-1 హీరోయిన్‌

Deepika Padukone is the mos
బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే .. తన భర్తతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘83’ మూవీ త్వరలో రీలీజ్‌ కానుంది. ఇక ఈ బ్యూటీ దాదాపు 7 ఏళ్లుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది చేస్తుంది. ఇక దీపికా తీసుకునే రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఆమె ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికంను తీసుకుంటుందట. ఈమద్య కాలంలో దీపిక తన పారితోషికంను 10 శాతం పెంచినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీపిక పదుకునే సినిమాలు మరియు బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా 65 మిలియన్ డాలర్ల సంపాదన పొందింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో సంపాదన దక్కించుకోలేదు. ఇక దీపికా లేడీఓరియేంటేడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు పోటీ ఇస్తుంది. ఈ భామ త్వరలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం కూడా దీపికాకు భారీగానే ముట్టజెప్పారని తెలుస్తుంది. కాగా ఈ ఏడాది నటించిన ‘ఛపాక్’ ప్రేక్షకులను అలరించిలేకపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu