HomeTelugu Big StoriesDevara: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్‌

Devara: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్‌

Devara new release date annDevara:  టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్‌లో రావడం పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఎన్టీఆర్‌ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సముద్ర నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ లుక్‌, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పార్ట్‌-1ని ఏప్రిల్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ అలీఖాన్‌కు గాయం కావ‌డంతో షూటింగ్ ఆల‌స్యం అయ్యి రిలీజ్ డేట్ వాయిదా ప‌డింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

ఈ సినిమాను 2024 అక్టోబర్ 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దీనితో పాటు కొత్త ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu