మణిరత్నంతో చరణ్ సినిమా..?

మణిరత్నం లాంటి డైరెక్టర్ తో పని చేయాలని ప్రతి హీరో ఆస పడుతుంటాడు. కానీ ఆ అవకాశం
కొందరికి మాత్రమే దక్కుతుంది. ఈ నేపధ్యంలో మన మెగాహీరో రామ్ చరణ్ ను ఈ అవకాశం
వరించినట్లుగా చెప్పుకుంటున్నారు. మణిరత్నం తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీసి చాలా
సంవత్సరాలే అయింది. కొన్నేళ్లుగా ఆయన తెలుగులో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారికి కథలు కూడా వినిపించాడు. కొన్ని
కారణాల వలన ఆ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కలేదు. దీంతో మణిరత్నం మరోసారి చరణ్ ను కలిసి కథ
వినిపించాడట. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మణిరత్నం ప్రస్తుతం కార్తీ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత చరణ్ తో సినిమా
చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే చరణ్ మాత్రం తన దృవ సినిమా షూటింగ్
పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ఇలా చూసుకుంటే
మణిరత్నం సినిమా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.