HomeTelugu Trendingచిరంజీవి పట్ల నెగెటివ్‌ ప్రచారం.. విజయ్‌ దేవరకొండ కౌంటర్

చిరంజీవి పట్ల నెగెటివ్‌ ప్రచారం.. విజయ్‌ దేవరకొండ కౌంటర్

deverakonda interesting com
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత- విజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పుడు విజయ్ బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. చిరంజీవి పట్ల జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి విజయ్ గట్టిగానే బదులిచ్చాడు.

‘సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి ఫ్లాప్, హిట్స్ కు అతీతం. రజనీకాంత్ సర్ 5-6 వరకు ఫ్లాప్ లు ఇచ్చారు. కానీ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తిరిగొచ్చారు. కనుక మనం నోరు మూసుకుని సినిమా చూడాలి”. చిరంజీవి కూడా వరుసగా ఆరేడు ఫ్లాఫ్ లు ఇచ్చారు. సరైన దర్శకుడు చిరంజీవి సత్తాను సరిగ్గా ఉపయోగించుకుంటే సెన్సేషనల్ సినిమాతో తిరిగొస్తారు. చిరు సర్ పరిశ్రమనే మార్చేశారు.

ఆయన వచ్చిన తర్వాత యాక్షన్, డ్యాన్స్, పనితీరు మొత్తం మారిపోయింది. ఎంతో మంది సినిమా వైపు వచ్చేందుకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు’ అని విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు. నటులను ఫ్లాప్ లు, హిట్ ల ఆధారంగా జడ్జ్ చేయవద్దని విజయ్ కోరాడు. ఎంతో మంది పరిశ్రమ వైపు వచ్చేలా స్ఫూర్తినిచ్చినందుకు వారిని (చిరంజీవి, రజనీకాంత్) గౌరవించాలని సూచించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu