‘అమూర్‌’ ఫ్రెంచ్‌ ప్రేమతో ప్రభాస్‌..!

‘సాహో’ సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రభాస్ తన 20 సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం తాను సెట్స్‌లో జాయిన్‌ అయ్యానంటూ పూజా సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోలు పంచుకున్నారు. అప్పటికే వర్కింగ్‌ టైటిల్‌ను కూడా అనేసుకున్నారు. కానీ పూజా వర్కింగ్‌ టైటిల్‌ కనిపించకుండా వేలు అడ్డుపెట్టేశారు.

ఈ సినిమాకు ఆసక్తికరంగా ఫ్రెంచ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘అమూర్‌’ (ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. అదీ కాకుండా ఈ సినిమాను ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమా కోసం రాధాకృష్ణ పీరియాడికల్‌ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథని అంటున్నారు.