HomeTelugu Trendingరామ్‌ సినిమాకి దేవిశ్రీ సంగీతం

రామ్‌ సినిమాకి దేవిశ్రీ సంగీతం

Devi sri prasad music for r
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని తన 19వ సినిమాని తమిళ దర్శకుడి లింగుస్వామి డైరక్షన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అఫీషియల్‌ గా ప్రకటించింది. ఉప్పెన భామ కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌ గానటిస్తోంది. రామ్‌ -లింగుస్వామిల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకి ఉస్తాద్‌ టైటిల్‌ ని పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసినిమాకి సంబంధించి ఏ అధికారిక ప్రకటన వచ్చినా ఉస్తాద్‌ అనే పేరుని పెట్టడంతో టైటిల్‌ అదేనంటున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా రామ్‌ మెప్పించనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస చిట్టూరి ఈసినిమాని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu