HomeTelugu Big StoriesUppena: రీమేక్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

Uppena: రీమేక్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

Uppena remake in Bollywood

Uppena remake in Bollywood: టాలీవుడ్‌లో వైష్ణవ తేజ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ హీరో,హీరోయిన్‌లకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్‌ల కొత్త ప్రాజెక్ట్‌ RC16 సినిమా పూజాకార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్‌ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్‌ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్‌లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్‌ చేస్తే అందులో హీరోయిన్‌గా ఖుషి కపూర్‌ను సెట్‌ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట.

Uppena 1

ఖుషి కపూర్‌.. లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్‌లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా ఉంటుంది అని బోనీకపూర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. మరి హీరో ఎవరూ తెలియాలంటే.. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్‌ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్‌ చేస్తుందట. విజయ్‌ వారసుడు సంజయ్‌ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్‌లో ఉప్పెన రీమేక్‌ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu