Homeతెలుగు Newsజగన్‌పై దేవినేని విమర్శలు

జగన్‌పై దేవినేని విమర్శలు

విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తనపై కుట్ర పన్నారంటూ ముఖ్యమంత్రిని, డీజీపీని జగన్‌ ముద్దాయిలుగా పేర్కొనడం సరికాదన్నారు. జగన్ కేసు విషయంలో పోలీసు విచారణ సక్రమంగానే జరుగుతోందన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ పోలీసులకు సహకరించలేదని..ఇప్పుడు 23 రోజుల తర్వాత థర్డ్‌ పార్టీ విచారణ జరపాలనడం దారుణమని మండిపడ్డారు. జగన్ నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు పలు సార్లు ప్రయత్నించినా ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకిచ్చి సహకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా పోలీసులపై జగన్‌కు నమ్మకం లేదని.. బాధ్యతలను విస్మరించి ఆయన మాట్లాడటం మంచిపద్ధతి కాదని దేవినేని విమర్శించారు.

5 16

జగన్‌ కోడికత్తి నాటకం తొందరలోనే బయటపడుతుందని మంత్రి అన్నారు. వైసీపీ అధినేత అవినీతిలో కూరుకుపోయి మాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 2019 నాటికి గోదావరి నీటిని నాగార్జున కుడి కాలువకు మళ్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓవైపు రాష్ట్ర భవిష్యత్‌ కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే.. జగన్‌ ఇలా విమర్శించడం తగదన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu