HomeTelugu Trendingది వారియర్: 'దడ దడ' సెకండ్‌ సింగిల్‌ విడుదల

ది వారియర్: ‘దడ దడ’ సెకండ్‌ సింగిల్‌ విడుదల

Dhada Dhada Lyrical from Th

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్విల్ లో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ది వారియర్’ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మరియు టీజర్ లు ప్రేక్షకులను అలరించాయి.

ఈ నేపథ్యంలో ‘వారియర్’ సినిమా నుండి తాజాగా ‘దడ దడ’ అనే సెకండ్ సింగిల్ ని విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ‘దడ దడమని హృదయం శబ్దం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం.. బడబడమని వెన్నెల వర్షం.. నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం’ అంటూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. రామ్ – కృతి జంట స్క్రీన్ పై అందగా కనిపిస్తోంది. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సాంగ్ షూటింగ్ టైంలోనే సెట్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఈ పాటకు సంగీతం అందించారు. సింగర్ హరి చరణ్ ఈ గీతాన్ని ఆలపించారు. ‘ది వారియర్’ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండగా.. అక్షర గౌడ కీలక పాత్ర పోషించింది. నదియా – నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 2022 జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu