HomeTelugu Trending'హను మాన్‌' మూవీ వచ్చేది అప్పడే!

‘హను మాన్‌’ మూవీ వచ్చేది అప్పడే!

no change in the release da

ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో కొత్త కాన్సెప్ట్‌ల తెరకెక్కుతున్న సినిమాలతో ‘హను-మాన్‌’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుంది. ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. సోషల్​మీడియాలో యూట్యూబ్‌లో ఫుల్​ ట్రెండింగ్‌ అయింది.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానుంది. అయితే మధ్యలో విడుదల తేదీ వాయిదా పడనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ముందుగా అనుకున్న తేదీ ప్రకారం పక్కాగా విడుదల చేయాలని మూవీటీమ్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. విడుదల తేదీకి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటం వల్ల ఇక ప్రమోషన్స్​ కూడా మొదలుపట్టాలని మూవీటీమ్ ఫిక్స్ అయిందట. అక్టోబర్​లో ట్రైలర్​ విడుదల చేసి ప్రమోషన్స్​ ప్రారంభిస్తారని తెలిసింది.

సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం వల్ల.. ఇక అప్పటి నుంచి నాన్​ స్టాప్​ పబ్లిసిటీ చేస్తారట. బాలీవుడ్​లో పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. పబ్లిసిటీకి కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా రెడీ అయిపోయిందని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో తెలిపారు దర్శకుడు ప్రశాంత్. ఈ సినిమా కోసం ఎన్నో వీఎఫ్ఎక్స్‌ స్టూడియోలతో కలిసి పనిచేశారట. సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. అమృతా అయ్యర్‌ హీరోయిన్​గా నటించింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu