HomeTelugu Trending'ధమ్కీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ధమ్కీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Dhamki movie release date f

విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’. సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే కథ.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. విష్వక్ యాక్షన్ లోకి దిగిపోయినట్టుగానే ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే సినిమా ఇది.

ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్, రోహిణి, అజయ్ కనిపించనున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో విష్వక్ హిట్ కొడతాడేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu