HomeTelugu Trendingలైగర్: 'అకడి పకడి' సాంగ్‌ ప్రోమో

లైగర్: ‘అకడి పకడి’ సాంగ్‌ ప్రోమో

Akdi pakdi song promo from
టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ‘ఆగస్టు 25’న విడుదల కానుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం.

ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ విడుదల తేదిని ఇటివలే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘అకడి పకడి’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను జులై 11న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఈ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రొమోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో మొట్టమొదటిసారిగా మాస్ స్టెప్పులు వేశాడు రౌడీ హీరో. ఈ స్టెప్పులకు విజయ్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu