HomeTelugu Trendingశేఖర్‌ కమ్ముల- ధనుష్‌ మూవీ ఫిక్స్‌

శేఖర్‌ కమ్ముల- ధనుష్‌ మూవీ ఫిక్స్‌

Dhanush and sekhar kammula

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుశ్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. టాలీవుడ్‌ డైరెక్టర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల ‘లవ్‌స్టోరీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే, బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో రానున్న ‘ది గ్రే మ్యాన్‌’ షూట్స్‌తో ధనుష్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu