‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్‌ కసరత్తులు.. ట్విటర్‌లో జిమ్‌ ఫొటోలు

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రామ్‌ కండలు పెంచే పనిలో ఉన్నాడు. ఈ విషయాన్ని రామ్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ రామ్‌ పోతినేని 2.0 లోడింగ్‌ అంటూ కామెంట్ చేశాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates