HomeTelugu Trendingహాలీవుడ్‌ సినిమాలో ధనుష్‌ ఫిక్స్‌

హాలీవుడ్‌ సినిమాలో ధనుష్‌ ఫిక్స్‌

Dhanush joins Hollywood mov
తమిళ హీరో ధనుష్ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘ఎవెంజర్స్‌’తో పాపులర్‌ అయిన రస్సో బ్రదర్స్‌ ‘ది గ్రే మ్యాన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన హీరోహీరోయిన్‌ల పేర్లను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. అందులో కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించనున్నట్లు ప్రకటించారు. ఆంథోనీ రస్సో ‘ది గ్రే మ్యాన్’ గురించి మాట్లాడుతూ… ‘ఈ చిత్రం ఇద్దరు గొప్ప నటులు అమెరికా నిఘా సంస్థ సీఐఏ రెండు విభిన్న రూపాలను చూపే పాత్రలు పోషిస్తున్నారు. అది ఎలా ఉంటుంది.. ఏమి చేస్తుందని అనేది చూపిస్తారు. వాస్తవికతకు మరింత దగ్గరగా ఉంటుంది ‘ అని అన్నారు.

‘ఏది ఏమైనా గోస్లింగ్ మరియు ఎవాన్స్‌తో సినిమా తీయాలనేది మాకు ఒక కల. ఈ చిత్రంలో వీరు మాస్టర్ హంతకులుగా చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. స్కాట్ స్టబర్‌తో మనం 20 ఏళ్లు వెనక్కి వెళతాం. ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ సరైన ప్లాట్‌ఫామ్ అని మేము భావిస్తున్నాం’ అని జో రస్సో తెలిపారు. హాలీవుడ్‌లో ధనుష్‌ కెరీర్‌లో ఈ చిత్రం రెండవ అంతర్జాతీయ ప్రాజెక్ట్. ఇంతకుముందు 2018లో వచ్చిన ‘ది ఎక్ట్స్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్‌’ చిత్రంలో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu