‘వకీల్‌ సాబ్‌’నుంచి ‘కంటిపాప’ వీడియో సాంగ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా ‘వకీల్ సాబ్’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘కంటిపాప’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ లపై చిత్రీకరించిన ఈ సాంగ్ ను అర్మాన్ మాలిక్, దీపు, థమన్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ప్రేమికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. థమన్ సంగీతం అందించారు.

CLICK HERE!! For the aha Latest Updates