HomeTelugu Big Storiesdhanush-sekhar kammula: నాగార్జున-ధనుష్‌ మల్టీస్టారర్‌ షూటింగ్ షూరూ

dhanush-sekhar kammula: నాగార్జున-ధనుష్‌ మల్టీస్టారర్‌ షూటింగ్ షూరూ

dhanush nagarjuna 1
dhanush-sekhar kammula: ప్రముఖ దర్శకుడు నేషనల్ అవార్డ్ విన్నర్‌ శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఈ రోజు గురువారం (జనవరి 18) హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మల్టీస్టారర్‌ గా తెరకెక్కునున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో నాగార్జున, ధనుష్, రష్మికా మందన్నా కీలక పాత్ర నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును #DNSగా పిలుస్తున్నారు.

నాగార్జున, రష్మిక, ధనుష్ లతో శేఖర్ కమ్ములలాంటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. తొలిరోజు ధనుష్ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా, ఈ నెలలోనే ఓ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

dhanush nagarjuna sekhar

పూజా కార్యక్రమంలో ధనుష్, శేఖర్ కమ్ముల, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిని తీసుకున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణులను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. పాన్ ఇండియా రెంజ్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

శేఖర్ కమ్ముల గత చిత్రాలు ఫిదా, లవ్ స్టోరీ భారీ విజయాలు సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగార్జున, నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ధనుష్‌ నటించిన కెప్టెన్‌ మిల్లన్‌ సినిమా కూడా తమిళంలో విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. తెలుగులో ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇక రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. సో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu