హీరోలు.. వారి సమ్మర్ ప్లాన్లు!

వేసవిలో సూర్యుడికి భయపడి చాలా మంది ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో మన స్టార్ హీరోలు ముందుంటారు. అయితే ఈసారి హీరోలంతా తమ సినిమా షెడ్యూల్స్ ను విదేశాల్లో ప్లాన్ చేసుకున్నారు. ముందుగా బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ ల సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేస్తున్నారు. అలానే మహేష్ బాబు, మురుగదాస్ సినిమాలో ఓ పాట చిత్రీకరణ కోసం విదేశాలకు పయనమవుతున్నాడు.
అలానే ఆయన చేయబోయే తదుపరి సినిమా షూటింగ్ ను లండన్ లో ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ హీరో నితిన్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నాడు. మంచు విష్ణు కూడా ఆచారి అమెరికా యాత్ర కోసం అమెరికా ప్రయాణం చేయబోతున్నాడు. అలానే రవితేజ, అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నాడు.