HomeTelugu Trendingధనుష్‌ కొత్త సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ధనుష్‌ కొత్త సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

Dhanush new movie title ann

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కేవలం తమిళంలోనే కాకుండా హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే శేఖర్‌కమ్ములతో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన ధనుష్‌.. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో కొత్త సినిమాని పట్టాలెక్కించారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘సార్‌’ సినిమా చేయనున్నారు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. తమిళంలో ‘వాతి’అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu