HomeTelugu TrendingRRRలో శ్రీయ.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

RRRలో శ్రీయ.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

1 7
దర్శకధీరుడు రాజమౌళి తెరక్కెకిస్తున్న భారీ చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షన్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. కాగా గత కొంతకాలంగా.. ఈ సినిమాలో నటి శ్రీయ నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రీయ. ఈ సినిమాలో తాను కూడా భాగం కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది ఈ బ్యూటీ. తన పాత్ర తాలూకు వివరాలు కూడా చెప్పేసింది.

తాజాగా హలో యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. తెలుగులో రెండు చిత్రాలకు ఓకే చెప్పానని, RRR మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను కనిపించనున్నానని ప్రకటిస్తూ సీక్రెట్ రివీల్ చేసేసింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న త్వరలోనే మిగిలిన భాగం ఫినిష్ చేసి జనవరి 8న ఈ మూవీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్‌ ‘ఛత్రపతి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది శ్రీయ. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో కలిసి పనిచేయబోతోంది ఈ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu