ధరమ్‌తేజ్‌కు ‘ప్రతిరోజూ పండగే’

‘చిత్రలహరి’ విజయం సాయి ధరమ్‌తేజ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంతకం చేశారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

జూన్‌ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. తమన్‌ సంగీతం అందిస్తారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సుప్రీమ్‌’ తర్వాత ధరమ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. త్వరలో ఆయన దేవా కట్టాతో కలిసి పనిచేయనున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ధరమ్‌ తేజ్‌ కోసం సామాజికాంశాలతో కూడిన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.