HomeTelugu Big StoriesNTR: దిల్‌రాజు ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్‌కు ఆహ్వానం

NTR: దిల్‌రాజు ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్‌కు ఆహ్వానం

Dil Raju family personally 1

NTR: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి ఇటీవలే రౌడీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 నవంబర్‌లో అశిష్‌ రెడ్డి నిశ్చితార్థం ప్రముఖ వ్యాపారవేత్త కూతురుఅద్విత రెడ్డి తో జరిగింది.వీరి వివాహ వేడుకలు జైపూర్‌లో జరుగనున్నాయి.

ఫిబ్రవరి 14న జరుగనున్న వీరి పెళ్లికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు దిల్‌ రాజు కుంటుంబ సభ్యులు. తారక్‌కు దిల్‌ రాజు, శిరీష్‌, అశిష్‌ శుభలేక అందిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అశిష్‌ ప్రస్తుతం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సెల్ఫిష్‌ సినిమాలో నటిస్తున్నాడు.

Dil Raju1

 

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అప్డేట్స్‌ ఈ మూవీపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu