HomeTelugu Big Storiesలైగ‌ర్‌: యాటిట్యూడ్ సాంగ్‌ వీడియో

లైగ‌ర్‌: యాటిట్యూడ్ సాంగ్‌ వీడియో

Waat Laga Denge Music Video
రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం ‘లైగ‌ర్‌’. పూరి జ‌గ‌న్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలున్నాయి. ఇక ఇటీవ‌లే విడ‌దులైన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఒక్క ట్రైల‌ర్‌తోనే లైగ‌ర్ చిత్రంపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈక్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌లో ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని పెంచుతున్నారు.

తాజాగా మేక‌ర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు. సునీల్ క‌శ్య‌ప్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా ఆల‌పించాడు. పూరి సాహిత్యం అందించాడు. ఇలా చిత్ర‌బృందం డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్లు చేస్తూ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu