ఆకాష్‌ పూరి ‘రొమాంటిక్‌’ నుండి మరో సాంగ్‌


డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ తనయుడు.. ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఓ వీడియో సాంగ్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని మరో పాటను రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ‘నా వల్ల కాదే’ లిరికల్‌ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. అందులో ఆకాష్‌ పూరి సముద్ర ఒడ్డున ఫుల్‌ బాటిల్‌ను ఎత్తి తాగుతూ కనింపించగా.. హీరోయిన్‌ కేతికా శర్మ ఆకాష్‌ వెనకాల విచారంగా కుర్చుని ఉన్నారు. దీంతో ఇది ఓ విషాద ప్రేమ గీతం కావచ్చని కొందరు, బ్రేక్‌ ప్‌ సాంగ్‌ ఏమోనని మరికొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సాంగ్‌ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చేడాల్సిందే.