HomeTelugu News'యాత్ర'లో లేని జగన్‌?

‘యాత్ర’లో లేని జగన్‌?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో వైఎస్ తనయుడు వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషిస్తారు అనే విషయంపై చాలా రోజుల నుండి అభిమానుల్లో సందిగ్దత నెలకొంటూ వస్తోంది.

3 4

కానీ ఇప్పుడు అసలు సినిమాలో జగన్ పాత్రే ఉండదని, స్క్రిప్ట్ నుండి జగన్ సన్నివేశాలను తొలగించేశారని సమాచారం. దర్శకుడు రాఘవ్ ఈ సినిమా వైఎస్ 2003లో చేసిన 1500 కిలోమీటర్ల పాదయాత్రను ఆధారంగా చేసుకుని మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మమ్ముటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu