HomeTelugu NewsNikhil Siddhartha: టీడీపీలో చేరిన టాలీవుడ్‌ హీరో!

Nikhil Siddhartha: టీడీపీలో చేరిన టాలీవుడ్‌ హీరో!

Nikhil Siddhartha has joined TDP

Nikhil Siddhartha: టాలీవుడ్‌ హీరో నిఖిల్​ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.’కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నిఖిల్‌ ఓ ఓ వారియర్​ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.

నిఖిల్ తెలుగుదేశం పార్టీ లో చేరాడు. ఈమేరకు ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్ కి టీడీపీ చీరాల టికెట్ కేటాయించింది. దీంతో నిఖిల్ కూడా ఈమేరకు ట్వీట్ చేసి తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకు వచ్చింది, నిఖిల్ టీడీపీలో చేరలేదని, కేవలం ఆయనకు సపోర్ట్ గా మాత్రమే అక్కడికి వెళ్లారని ఆయన టీం వెల్లడించింది. ఇక 2019లో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. కర్నూల్ జిల్లా డోన్‌లో టీడీపీ తరుపున ప్రచారం చేసి టీడీపీకి ఓటు వేయండి అంటూ.. చంద్రబాబు స్టైల్‌లో రెండు వేళ్లూ చూపిస్తూ ఓ రేంజ్‌లో ఆయన ప్రచారం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu