HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ సినిమా కథపై క్లారిటీ ఇచ్చిన హరీష్‌ శంఖర్

పవన్‌ కల్యాణ్‌ సినిమా కథపై క్లారిటీ ఇచ్చిన హరీష్‌ శంఖర్

5 4
టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ తరువాత ‘పింక్’ సినిమా రీమేక్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మే 15న ఈ సినిమాను రిలీజ్‌ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్‌ క్రిష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ దొంగగా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంతో పాటు హరీష్ శంకర్ సినిమా పై కూడా ఓ ప్రచారం చక్కర్లు కొడుతుంది.

గతంలో పవన్ తో హరీష్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలో సల్మాన్ నటించిన ‘దబాంగ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అయితే తాజాగా మరోసారి పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కోసం ఇతర భాషలో హిట్ అయిన ఓ సినిమాను హరీష్ రీమేక్ చేస్తున్నాడని ప్రచారం సాగుతుంది. హరీష్ శంకర్ ఈ వార్తలపై స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని,ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు తనను సంప్రదించాలని అన్నారు డైరెక్టర్‌ హరీష్ శంకర్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu