HomeTelugu Trendingఐశ్వర్య రజనీకాంత్‌ 'సంచారి' మ్యూజిక్ వీడియో.. విడుదల

ఐశ్వర్య రజనీకాంత్‌ ‘సంచారి’ మ్యూజిక్ వీడియో.. విడుదల

Aishwarya rajinikanth sanch
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ‘పయని’ అనే మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ మ్యూజిక్ సింగిల్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీడ్ రోల్ లో నటించడం విశేషం. ఈ వీడియోను రజనీకాంత్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తన కుమార్తె దర్శకత్వం వహించిన ‘పయని’ మ్యూజిక్ సింగిల్ ను రిలీజ్ చేయడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఐశ్వర్య 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ డైరెక్షన్ చేపట్టిందని రజనీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వివరించారు.

కాగా, ‘పయని’ సాంగ్ లో జానీ మాస్టర్ సరసన శ్రష్టి వర్మ నటించింది. ఈ పాటకు అంకిత్ తివారీ సంగీతం అందించగా, అనిరుధ్ ఆలపించారు. తమిళంలో సాగే ఈ పాటకు వివేక సాహిత్యం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu