HomeTelugu Newsడిస్కోరాజా రీలీజ్‌ డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

డిస్కోరాజా రీలీజ్‌ డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

11 3టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్‌ పోస్టర్‌, బాబీ సింహ లుక్‌, లిరికల్‌ సాంగ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

అయితే సినిమా విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రవితేజ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అయితే మాస్‌ మహారాజ్‌ అభిమానులకు చిత్ర యూనిట్‌ తీపి కబురు చెప్పింది. ‘డిస్కో రాజా’ వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది. దీనికి డేట్‌ గుర్తుపెట్టుకోండి అంటూ రవితేజ రీట్వీట్‌ చేశాడు. దీంతో జనవరి 24న డిస్కోరాజాతో రవితేజ థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు కన్ఫార్మ్‌ అయింది.

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిసిందే. అయితే అనుకున్న రీతిలో అవుట్‌పుట్‌ రాకపోవడంతో చిత్ర యూనిట్‌ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా వచ్చే వేసవి ప్రారంభంలో విడుదుల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. అబ్బూరి రవి మాటలు​ అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!