HomeTelugu TrendingDisha Patani: సమంత ప్లేస్‌లో దిశా పటానీ.. ఈసారి అంతకు మించి

Disha Patani: సమంత ప్లేస్‌లో దిశా పటానీ.. ఈసారి అంతకు మించి

Disha Patani item song in P

Disha Patani: అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీనిలో ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ సాంగ్‌ యూత్‌ని ఊపు ఊపేసింది. ఆ పాటలో సమంత తన అందంతో అభినయంతో అదరగొట్టేసింది. దేవిశ్రీ సంగీతం, ఇంద్రావతి స్వరం, చంద్రబోస్‌ సాహిత్యం ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయని అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్స్‌ ‘పుష్ప2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఈ సినిమాలో ఐంటమ్‌ సాంగ్‌ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో తొలి పార్ట్‌లోని ఐటమ్‌నంబర్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండబోతుందట.

అందుకే బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారట దర్శకుడు సుకుమార్‌. తొలి పార్ట్‌లోని పాటను మించేలా ఈ సాంగ్‌ని దేవిశ్రీ స్వరపరిచినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నారట. దిశా పటానీ పూరీజగన్నాథ్‌ ‘లోఫర్‌’లో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎం.ఎస్‌.ధోనీ, బాగీ2, బాగీ3, ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ తదితర చిత్రాల్లో నటించి అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. త్వరలో విడుదల కానున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏ.డి’, సూర్య కంగువ చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu